నిద్రిస్తున్న వ్యక్తి పైనుంచి వెళ్ళిన కారు, వ్యక్తి మృతి...!
November 10, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- పొట్టకూటి కోసం మంచిర్యాల పట్టణం వెళ్లి... గుర్తుతెలియని వాహనం పై నుంచి పోవడంతో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.... నెన్నెల మండలంలోని కోనంపేటకు చెందిన సూరం కొమురయ్య అనే వ్యక్తి కూలి పని కోసం 3 రోజుల కిందట మంచిర్యాల పట్టణానికి వచ్చాడు. అయితే స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా డివైడర్ పక్కన రాత్రి పడుకున్న తరువాత వ్యక్తి పై నుంచి గుర్తుతెలియని కారు వెళ్లడంతో, తీవ్ర గాయాలైన ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. సమాచారం తెలుసుకున్న ఎస్సై తహసినోద్దీన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామన్నారు.

