ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై నెన్నెల మండలంలోని ఆవుడం, గంగారం గ్రామాల నుండి కాంగ్రెస్, BJP మరియు ఇతర పార్టీల నుండి సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య  సమక్షంలో B(T)RS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు టిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి-ప్రతాప్ రెడ్డి, నెన్నెల ఎంపీటీసీ తిరుపతి, మాజీ PACS చైర్మన్ రమేష్, ఇతర ప్రజాప్రతినిధులు, B(T)RS పార్టీ మండల SC సెల్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఏసు, షాకీర్ పాషా, ఆవుడం, గంగారం గ్రామాల అధ్యక్షులు, ఇతర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by