DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత అండర్ బ్రిడ్జి పైన పట్టాలు దాటుతుండగా గురువారం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండగా, ఒంటిపై పింక్ రంగు నైటీ ధరించి ఉంది. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కేంసారం సంపత్ సంఘటన స్థలానికి చేరుకొని, ఆచూకీ తెలిసినవారు 83285 12176 94, 9440900792 నంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.

