DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... మంచిర్యాల నుంచి పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య ప్రాంతంలో గుర్తు తలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన వ్యక్తి యొక్క వయస్సు 40 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండి, బ్లాక్ కలర్ టీ షర్ట్, లైట్ మెరూన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడతామన్నారు. మృతుని వివరాలు ఎవరికైనా తెలిస్తే 9440900792, 9440700038 సమాచారం అందివ్వాలని సూచించారు.

