DIGITAL MANCHERIAL NEWS:- ఎన్నో ఏళ్ల తర్వాత నెన్నెల మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో తీరిన వాహనాల పార్కింగ్ సమస్య. వివరాల్లోకి వెళితే...నెన్నెల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన వాహనాల పార్కింగ్ షెడ్ ను బుధవారం బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ చేతుల మీదగా ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులకు సంబంధించి సిబ్బందితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.... దొంగతనాలు జరగకుండా వ్యాపారస్తులు, ప్రజలు ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో నెన్నెల ఎస్సై తోపాటు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

