DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని లక్షేటిపేట్ మండలంలోని ఇటిక్యాల గ్రామం ఈనాడు కార్యాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి కాలు నుజ్జు నుజ్జయింది. స్థానికులు వెంటనే గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


