మంచిర్యాల జిల్లా:- తాగిన మైకంలో గుంటలో పడే మృతి చెందిన ఘటన లక్షట్ పేట్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి పోసన్న (35) అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్వించిన గుంత వైపు వెళ్లి తాగిన మైకంలో గుంతలో పడిపోయాడు. దీనితో తీవ్ర గాయాలైన ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక ఎస్సై చంద్రశేఖర్ తెలియజేశారు.

