DIGITAL MANCHERIAL NEWS:- వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల జన్మ దిన సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో బెల్లంపల్లి వైయస్సార్ టిపి నియోజక వర్గ కొ ఆర్డినేటర్ కాశీ సతీష్ కుమార్ ఆధ్వర్యం లో కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... షర్మిల ప్రజల బాగోగుల కోసం, ప్రజల సంక్షేమం కోసం మహా ప్రజా ప్రస్థానం లో బాగంగా రాష్ట్రమంతా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు జాగటి కల్పన, జిల్లా ప్రధాకార్యదర్శి ఆడేపు మహేశ్, బెల్లంపల్లి మండల అధ్యక్షులు ఆధర్ల మహేందర్, పట్టణ అధ్యక్షులు గోషిక సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేశ్, జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి వెముర్ల మహేశ్ బాబు, పట్టణ నాయకులు రాము, మహిళ నాయకురాలు లక్ష్మి, పోషవ్వ, రాణీ, తదితరులు పాల్గొన్నారు.


