DIGITAL MANCHERIAL NEWS:- భీమిని మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల మేరకు శనివారం ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పరమేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మధు, సర్పంచులు భూమన్న, సురేష్, ఆర్ఐలు వెంకటేష్, వంశీ, జూనియర్ అసిస్టెంట్ మరియు నాయకులు బొగ్గుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

