రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) పాఠశాలలో  ఈనెల 2నుండి 3వరకు జరిగిన  రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన - 2022 జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో 9వ తరగతి చదువుచున్న సాయి విఘ్నేష్ ప్రథమ బహుమతి సాధించడంతోపాటు, రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సైదులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... తక్కువ ఖర్చులతో పంట పొలాల దగ్గర ఏర్పాటు చేసుకునే పరికరాలను తయారు చేసినందుకు గాను ఉత్తమ బహుమతిని సాధించాడని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను... మంచిర్యాల జిల్లా డిఈఓ, సంక్షేమ గురుకులాల ఆదిలాబాద్ ప్రాంతీయ సమన్వయ అధికారి కొప్పుల స్వరూప రాణి, ఇతర ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by