DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా మార్క్స్ భవన్ లో జాతీయ నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాకుండా అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేసే విధంగా తీర్మానం చేయాలని PDSU విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి చరణ్, డి.శ్రీకాంత్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలపై చిత్తశుద్ధి లేకుండా వాస్తుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియం చేస్తూ అసెంబ్లీ నిర్మించడం సిగ్గుచేటుగా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులను అరికట్టాలని, నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలను రద్దు చేయాలని, అలాగే శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రీయింబర్మెంట్ 4 వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని. హాస్టల్ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించి ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7 ప్రగతి భవనం ముట్టడి చేయడం జరుగుతుందని... కావున విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని PDSU విద్యార్థి సంఘం గా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, సిద్ధార్థ, బన్నీ, పట్టణ కార్యదర్శి రాహుల్, జిల్లా సభ్యులు తిరుపతి, వినోద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
.

