DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ కి చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకార్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) లో అడ్మీషన్స్ సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాను సైదులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఐకార్ ఆగస్టు నెలలో నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశపరీక్షలో అత్యంత ప్రతిభ చూపిన రావుల మాదవన్ 239 ర్యాంకుతో యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, బెంగుళూర్(కేరళ)లో బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో అడ్మీషన్ సాధించాడు. అదేవిధంగా చాపిడి అజయ్ 881 ర్యాంకుతో డా.రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ,పూస (బీహార్) లో బిఎస్సీ(హానర్స్)హార్టికల్చర్ కోర్సులో అడ్మీషన్ సాధించాడు. సందర్భంగా విద్యార్థులను ఆర్సీఓ కొప్పుల స్వరూప రాణి, ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, అధ్యాపకులు నాగిని శ్రీరామవర్మ, చందా లక్ష్మీనారాయణ, మిట్టా రమేష్, సురేష్ గౌడ్, సుంకరి అర్జున్, కట్ల రవీందర్, ఆకినేపల్లి రాజేష్, మహమద్ రఫీ, గాజుల రాజేందర్, అనుముల అనిరుద్, సజ్జనపు విజయ్, అవునూరి రవి లు విద్యార్ధులను అభినందించారు.

