ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా కార్యదర్శిగా అల్లి సాగర్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మలిదశ తెలంగానోద్యమంలో చురుకైన పాత్ర వహించి ఎన్నో నిర్బందాలను, అక్రమ కేసులను ఎదుర్కొన్న మంచిర్యాల జిల్లా ప్రజలకు సుపరిచితుడు అయినా అల్లి సాగర్ యాదవ్ ను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్(AISB) మంచిర్యాల జిల్లా కార్యదర్శి గా శనివారం బెల్లంపల్లిలో జరిగిన ఎ.ఐ.ఎస్.బి విస్తృతస్థాయి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి తనమీద నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన ఎ.ఐ.ఎస్.బి రాష్ట్రకమిటికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లాలో విద్యార్థి సంఘాన్ని బలోపితం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by