DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్లను సహించేది లేదని జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల తిరుమల హిల్స్ వెంచర్లకు అక్రమంగా వేసిన రోడ్లను బ్లేడ్ ట్రాక్టర్ తో తొలగించారు. ఈ సందర్భంగా.... ఎటువంటి పర్మిషన్లు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో పంచాయితీ రాజ్ అధికారులు, జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి తహశీల్ధార్ కుమారస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



