DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సి ఓ ఈ) విద్యార్థులు జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో నాలుగు గోల్డ్ మెడల్, ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. డిసెంబర్ 18 న బెల్లంపల్లి టి సి ఓ క్లబ్ లో విక్టోరియా సోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విద్యార్థులు మెడల్స్ సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. డి వరప్రసాద్, వై ఉదయ్, ఆర్ ప్రణవ్, జి.జయంత్ లు అత్యంత ప్రతిభ చూపి బంగారు పథకాలు సాధించగా వై మహోన్నత్, ఐ గౌతమ్ సాయి, డి ఆశిత్ లు వరుసగా వెండి కాంస్య పథకాలు సాధించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో సత్తా చాటి మెడల్స్ సాధించిన విద్యార్థులను సంక్షేమ గురుకులాలు ఆదిలాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూప రాణి అభినందించారు. సోమవారం బెల్లంపల్లి గురుకులం ఆవరణలో మెడల్స్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యాపక, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పీఈటి వామన్ అధ్యాపకులు మిట్ట రమేష్, నాగిని శ్రీరామ వర్మ, ఆకినేపల్లి రాజేష్ ఉపాధ్యాయులు వరమని ప్రమోద్, భోగ అశోక్, పి. రాజకుమార్, శ్యాంసుందర్ రాజు, స్రవంతి, సబియా భాను, దత్త ప్రసాద్, ఆర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

