DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ( సి ఓ ఈ) లో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన గణిత మేళా ను ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై రాజశేఖర్ ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త, భారతీయ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ పుట్టిన రోజైన డిశంబర్ 22 ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణితంలోని పలు క్లిష్టమైన అంశాలపై సులభంగా అర్థమయ్యేలా స్వయంగా తయారుచేసిన గణిత నమూనాల సహాయంతో వివరించి ఆకట్టుకున్నారు. అలాగే గణితంలో గమత్తులు, నిత్య జీవితంలో గణితం అంశాలపై నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్య క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్ రేణిగుంట్ల సరిత, మ్యాథ్స్ డ్డిపార్టుమెంట్ అధ్యక్షులు వరమని ప్రమోద్ కుమార్ , జూనియర్ వైస్ ప్రిన్సిపల్ దాసం అజిత,ఉపాద్యయులు నాగిని శ్రీరామ వర్మ, దుర్గం రమాదదేవి, కోట్ర గణపతి, కొక్కుల రాజేశ్వర్ షిండే దత్తప్రసాద్, చంద్ర శేఖర్, కాసర్ల రాజేందర్, రామిశెట్టి రామారావు, మిట్ట రమేష్, అనిరుధ్, ఆకినేపల్లి రాజెష్, గాజుల రాజేందర్, చందా లక్ష్మి నారాయణ, విజయ్,సమందర్, రాజశేఖర్ తదితరులు పాల్గోన్నారు.





