DIGITAL MANCHERIAL NEWS:- పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చెయ్యాలని, చెయ్యని యెడల ప్రగతి భవనం ముట్టడిస్తామని అఖిలభారత విద్యార్థి బ్లాక్ (AISB) రాష్ట్ర కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం బెల్లంపల్లి పట్టణంలోని లక్ష్మి నరసింహ ఓకేషనల్ కాలేజ్ లో జిల్లా నాయకులు అల్లి సాగర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై సవితి తల్లి ప్రేమచూపిస్తుందని, సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నారే తప్ప విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం లేదని, కరెంట్, వాటర్ సమస్యలు, పక్క భవనాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ ముట్టడి చేపడుతామని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని, AISB ఆధ్వర్యంలో అసెంబ్లీ ముందు ఆమరణ నిరాహారదీక్షను చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో AISB రాష్ట్ర నాయకులు రాహుల్, శేఖర్, వెంకటేష్, బియ్యాల ప్రశాంత్, మనోహర్,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

