DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు గంజాయి తాగుతున్నారని తన దృష్టికి ఎప్పుడు రాలేదని కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... విద్యార్థులు రాత్రిపూట బయట తిరుగుతున్నానన్న కారణంతోనే ఆరుగురు విద్యార్థులను తొలగించామని, అలాగే విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నట్టు మా దృష్టికి రాలేదని వస్తే వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

