DIGITAL MANCHERIAL NEWS:- తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు KCR TRS ని BRS గా నామకరణం చేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించినందున వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి పార్టీని విజయవంతం అయ్యేలా దీవెనలు అందించి భారత దేశ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ఫలాలను అందేవిధంగా దీవెనలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. ఈ కార్యక్రమంలో తాండూరు జడ్పీటీసీ బాణయ్య, BTRS పార్టీ భీమిని మండల అధ్యక్షుడు నిరంజన్, నాయకులు భీమాగౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

