రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంగపేటకు చెందిన నాగుల లక్ష్మీనారాయణ, లింగాల తిరుపతి బైక్ పై బెల్లంపల్లి నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో బుధవారం రాత్రి తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల ఎదురుగా ప్రధాన రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగుల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... స్వల్ప గాయాలతో బయటపడిన తిరుపతిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. 




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by