DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు 17,01,972 రూపాయల విలువగల కల్యాణలక్ష్మి మరియు షాదిముభారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్, ఎంపీటీసీ లు సిరంగి శంకర్, శ్రీదేవి, రజిత, మొగిలి శంకర్, సర్పంచ్ లు నవీన్, కిస్తోఫర్ ,శంకర్ , గన్పూర్ సర్పంచ్ సాగర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రహిమత్ ఖాన్, యూత్ ప్రెసిడెంట్ అంజి, మైనార్టీ నాయకులు సాదు బాబు, అహూఫ్ ఖాన్, రాంచందర్, రైతు సమన్వయ సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మసాడి తిరుపతి, లబ్దిదారులు, సంబంధిత అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


