DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు KCR, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేస్తున్న అభివృద్ధికి, అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య సమక్షంలో BRS పార్టీలో చేరిన బిజెపి తాండూర్ మండల అధ్యక్షురాలు సంఘర్షీత శీతాల్, మహిళా మోర్చా బిజెపి కార్యదర్శి కొప్పుల రవళి, నాయకులు కంది రాజేశ్వరరావు, బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు చీటీ పోషం, కంది రాజేశ్వరరావు, తదితరులు సుమారు బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి సుమారు 100 మంది టిఆర్ఎస్ లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీీ లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి తాము ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.


