DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ నిర్వహించారు. సింగరేణి ఏరియా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ట్రస్టు దాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణు వంక సుమన్ శ్రీవిద్య సహకారంతో మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రతి మంగళవారం బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణులకు, రోగులకు, సాయి భోజన్ అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఈ అవకాశాన్ని ఆస్పత్రిలోని, స్థానిక కార్మికులు, గర్భిణీలు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. అలాగే మాట్లాడుతూ...ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గం, మానవ సేవే మాధవ సేవయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి జక్కం నాగమణి, సభ్యులు కొంక శ్రీనివాస్, సేవకులు ఏనుగు హేమలత, ఇగురపు భాస్కర్ విజ్జిగిరి శంకర్, , ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎవరైనా బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.


