DIGITAL MANCHERIAL NEWS:- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి మాట్లాడుతూ.... ప్రతి మంగళవారం బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణులకు, రోగులకు, సాయి భోజన్ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈరోజు బడుగు బలహీన అనగారిన వెనుకబడిన వర్గాల అన్నార్తిని తీర్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి జక్కం నాగమణి, సభ్యులు కొంక శ్రీనివాస్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్ట రామ్ కుమార్, సేవకులు ఇగురపు భాస్కర్,ఎనగందుల దత్తు ఏనుగు హేమలత, ఇగురపు భాస్కర్ ఎనగందుల దత్తు, సుంకరి సమ్మయ్య, విజ్జిగిరి శంకర్, రాసురి రాజశేఖర్, పల్లవి, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది పాల్గొన్నారు.


