DIGITAL MANCHERIAL NEWS:- లక్షెట్టిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో గల డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పూలమాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా వైయస్సార్ టిపి కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ మాట్లాడుతూ.... అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అణగారి బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమైందని, ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుగా భారత రాజ్యాంగం నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హాది, లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ సల్మాన్, యూత్ అధ్యక్షులు ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ సమీర్, వెంకటస్వామి, హాజి తదితరులు పాల్గొన్నారు.


