DIGITAL MANCHERIAL NEWS:- జైపూర్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న ఎన్ హెచ్ 63 రహదారి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళవారం పనుల పురోగతి పర్యవేక్షించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసి, పనులు తొందరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఇతరులు పాల్గొన్నారు.

