విద్యార్థులు ఉత్తమ క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేదించవచ్చు: డీసీపీ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- విద్యార్థులు ఉత్తమ క్రమశిక్షణతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మంచిర్యాల డిసిపి అఖిల్ మహజన్ సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యార్థుల కు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మంజూరు చేసిన ప్రోత్సాహకాలు సోమవారం స్థానిక  తాళ్ళగురజాల పోలీస్ స్టేషన్ లో బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ చదువుల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్న విద్యార్ధులకు ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందని అందుకు సిఓఈ బెల్లంపల్లి విద్యార్ధులకు అందజేస్తున్న నగదు ప్రోత్సాహకాలే నిదర్శనమన్నారు. విద్యార్ధులు ఒక క్రమబద్దమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఉన్నత విద్యలో సైతం ఉత్తమంగా రాణించవచ్చునన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు మాట్లాడుతూ... బెల్లంపల్లి సిఓఈ లో నిర్వహిస్తున్న ప్రత్యేక విద్యా సంబందిత కార్యక్రమాలను వివరిస్తూ గత విద్యా సంవత్సరంలో బెల్లంపల్లి సి ఓ ఈ లు విద్యనభ్యసించి ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన విద్యార్థులకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ కోట బాబూరావు, తాళ్ళగురిజాల ఎస్సై రాజశేఖర్, ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, వైస్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, అధ్యాపకులు మిట్టా రమేష్, సమెందర్, శివ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by