DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన సభలో లబ్ధిదారులకు 8 కోట్ల డ్వాక్రా రుణాలు, రైతుభీమా చెక్కులు, కళ్యాణలక్మి మరియు షాధిముభారఖ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇతర మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్ కుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ ఇతర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


