DIGITAL MANCHERIAL NEWS:- టీమిండియా యువ క్రికెటర్ వికెట్ కీపర్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురయ్యాడు. కారులో ఉత్తరప్రదేశ్ కు వెళుతుండగా రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ కు తలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు.

