DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి TCOA క్లబ్ లో నూతనంగా నిర్మించిన లాన్ టెన్నిస్ కోర్టును శనివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా టెన్నిస్ కోర్టును ప్రారంభించిన అనంతరం కొంచెం సేపు గ్రౌండ్ లోకి దిగి వారితో పాటు టెన్నిస్ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... విద్యార్థులు చదువులతో పాటు, ఆటల పోటీలలో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్,వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ కృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, మందమర్రి ఏరియా సింగరేణి GM, తాండూరు CI జగదీష్, తదితరులు పాల్గొన్నారు.



