మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాండూర్ మరియు నెన్నెల మండలాల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..... ఈనెల 29వ తారీఖున బెల్లంపల్లి నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్నందున ఆయా మండలాల్లోని బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకకాలంలో బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు,  మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, BRS పార్టీ ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by