DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడకి వాట్సాప్లో తెలియని నంబరుతో వీడియోకాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓ యువతి నగ్నంగా మాట్లాడి రికార్డ్ చేసింది. ఆ తర్వాత ఆ వీడియో క్లిప్ పంపించి డబ్బులు డిమాండ్ చేసింది. బాధితుడు పట్టించుకోకపోవడంతో మరోవ్యక్తి ఢిల్లీ పోలీసు అధికారినంటూ ఫోన్ చేశారు. మీపై ఓ యువతి ఫిర్యాదు చేసిందని బెదిరించగా, యువకుడు నిజమేననుకొని తన అకౌంట్ లో ఉన్న రూ. 1,70,000 లక్షలు సమర్పించుకోవలసి వచ్చింది.

.jpeg)