డిపాజిట్ రానివారు మాట్లాడడం సిగ్గుచేటు...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తోందని టిఆర్ఎస్ పట్టణ ప్రజాప్రతినిధులు అన్నారు. ఈ సందర్భంగా శనివారం మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ.... గత ఎన్నికల్లో డిపాజిట్లు రాని వ్యక్తులు కూడా ఇక్కడికొచ్చి మంత్రి హరీష్ రావు పైన, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పైన  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గం 2014 తరువాతే చిన్నయ్య ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్ కన్నా... తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకుల గెలి రాజలింగ్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సదానందం బెల్లంపల్లి పట్టణ కౌన్సిలర్స్, పట్టణ అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, మాజీ ప్రజా ప్రతినిధులు కో ఆప్షన్ నెంబర్స్, కార్యకర్తలు,  నాయకులు పాల్గొన్నారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by