రోడ్డు పూర్తికాకముందే... ట్యాక్స్ ఎలా వసూలు చేస్తారు...?

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా లో సోమగూడెంకు మందమర్రి కి మధ్యలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ప్రారంభించారు. అయితే రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకముందే టోల్ గేట్ ను ఏలా ప్రారంభిస్తారని బెల్లంపల్లి నియోజకవర్గ సామాజిక నేత జాడి రాజేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకముందే వాహనదారులపై పన్ను విధించి, సామాన్య ప్రజల పైన భారాన్ని వెయ్యడం ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by