DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి పెద్దంపేట రైల్వే మధ్యన గల అమ్మాలివాడ గేట్ సమీపాన శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు ఇలా ఉన్నాయి... మృతుడు బ్లూ కలర్ ఫుల్ టీ షర్టు, చాక్లెట్ కలర్ పాయింట్ ధరించి ఉన్నాడని... గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా మొఖం నుజ్జు నుజ్జు అయినట్లు బెల్లంపల్లి రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. అలాగే మృతుని శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరి గదిలో భద్రపరచినట్లు తెలిపారు.

