DIGITAL MANCHERIRAL NEWS:- సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో అండగా ఉపయోగపడుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఈ సందర్భంగా సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు 12,68,000 (పన్నెండు లక్షల అరవై ఎనిమిది వేల) రూపాయల విలువగల సిఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాస్, కన్నేపల్లి జెడ్పీటీసీ సత్యనారాయణ,మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, ఎంపీటీసీ శ్రీదేవి, కౌన్సిలర్స్ గోసిక రమేష్, నీలి కృష్ణ, చంద్రశేఖర్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, నేన్నెల్ మండల కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, ఇతర సర్పంచ్ లు, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, మండల BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


