DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గానికి చెందిన సామాజిక కార్యకర్త జాడి రాజేష్ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. శీతాకాలం దృశ్య నిరుపేదలు పడుతున్న చలి తీవ్రత గుర్తించి ఆదివారం గుడారాలల్లో నివసించే వారికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... రానున్న రోజుల్లో నిరుపేదల కోసం గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

