బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం లో ఇతర పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. బెల్లంపల్లి పట్టణ బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు కాసర్ల యాదగిరి,YSRTPజిల్లా ప్రధాన కార్యదర్శి న్యాతరి కిరణ్ ఇతర పార్టీ నాయకులు దాదాపుగా వందకు పైగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by