DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో మల్లంపేట్ పెట్రోల్ బంక్ గ్రామ సమీపానగల రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లేశ్(28) వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న సమయంలో బైక్ మరియు హార్వెస్టర్ డి కొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో... వారి కుటుంబంలో చీకటి ఛాయలు అలమరించుకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.

