DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం లో త్వరలో బెల్లంపల్లి వేదికగా జరగనున్న నేతకాని విద్యార్థుల ఆత్మీయ సదస్సును విజయవంతం చేసె దిశగా రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత సూచన మేరకు శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన TNMVS బెల్లంపల్లి నాయకులు. అలాగే ఈ నెల 18-12-2022 న జరగనున్న నేతకాని విద్యార్థుల ఆత్మీయ సదస్సు, సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరగాా, దానికిి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగాా మాట్లాడుతూ.... ఎమ్మెల్యే తో పాటు ఈ సమావేశానికి జాతి పెద్దలు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు డా"బోర్లకుంట వెంకటేష్ నేత, ప్రొఫెసర్ జాడి ముసలయ్య, ముడిమడుగుల శంకర్, సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోర్లకుంట రాజేష్ , జిల్లా వర్కింగ్ ప్రేసిడెంట్ రత్నం ప్రశాంత్, తాండూర్ మండల అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

