DIGITAL MANCHERIAL NEWS:- లక్షెట్టిపేట మండల కేంద్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై ప్రభుత్వ వైఖరికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ మాట్లాడుతూ.... ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తున్న షర్మిలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఒక మహిళ అని కూడా మర్చిపోయి దారుణంగా అరెస్ట్ చేశారని అన్నారు. షర్మిలకు ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. అలాగే రాబోయే ఎన్నికలలో విజయం సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హాది, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సల్మాన్, పట్టణ యూత్ అధ్యక్షులు జంగం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, హాజీ పాషా, మొహమ్మద్ ముజామిల్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.

