DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం ( TNMVS ) ఆధ్వర్యంలో జరిగిన బెల్లంపల్లి నియోజకవర్గస్థాయి నేతకాని విద్యార్థుల మరియు యువజన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, OU ప్రొఫెసర్ జాడి ముసలయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో మాత్రమే వ్యక్తిగత మరియు జాతి అభివృద్ధి సాధ్యమని, కావున అందరూ బాగా చదువుకోవాలని, ఎవరికి ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా చేయడానికి తామెప్పుడూ సంసిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో TNMVS రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెర రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం వినోద్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి బోర్లకుంట రాజేశ్ నేత, మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం ప్రశాంత్, నియోజకవర్గ అధ్యక్షుడు దుర్గం బానుప్రసాద్, నాయకులు కలాలి నర్సయ్య, గోమాస రాజం, రామటెంకి వాసుదేవ్, దుర్గం రాజేశ్, అసరెల్లి సారయ్య, రామటెంకి శివకార్తీక్, అన్ని మండలాల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

