DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని పొలంపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ మరియు ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదం. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా... మరొకరు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయారు, మరొకరు చికిత్స కొరకు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమునకు సంబంధిత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




