టోల్ గేట్ ఛార్జీలు నిలిపివేయాలి:PDSU.
December 31, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెం పరిధిలోని 363 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద ఛార్జీల వసూలు వెంటనే నిలిపివేయాలని పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ... రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకుండానే టోల్ ట్యాక్స్ పేరిట వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేయడం ఏ మాత్రం సరి కాదన్నారు. అలాగే బస్సు పాసులు తీసుకున్నప్పటికీ టోల్ ప్లాజాలు దాటిన తర్వాత ప్రయాణికులు, విద్యార్థుల నుంచి కండక్టర్లు పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్టీసీ డిఎం స్పందించి చర్యలు చేపట్టాలని, అలానే రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాతే టోల్ ప్లాజా లో పైసలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

