DIGITAL MANCHERIAL NEWS:- ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐఎస్ఎఫ్ మంచిర్యాల పట్టణ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్, పట్టణ అధ్యక్షులు చరణ్ మాట్లాడుతూ.... ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్కావెంజర్లు లేకపోవడంతో విద్యార్థులే పాఠశాల ఆవరణను మరుగుదొడ్డిన శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తద్వారా విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న మన ఊరు మనబడి పనులు త్వరగా పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను మన ఊరి మనబడి పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్దు, శ్రీహరి, చింటు, అర్జున్ పాల్గోన్నారు.


