ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్..!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ శివారు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్ పై ఇద్దరు వెళుతుండగా వెనుక నుంచి మరొక వాహనం వచ్చి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బోయపల్లి గ్రామానికి చెందిన మచ్చ శంకర్, బోయపల్లి బోర్డ్ కు చెందిన నాయిని రమేష్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో వీరితోపాటు పలువురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమునకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by