DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన గోగర్ల సాయిప్రియ మధ్యప్రదేశ్ లోని పన్నా పట్టణంలో జరగనున్న 25వ యూత్ నేషనల్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 16 నుండి 22 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలకు సాయిప్రియ తెలంగాణ జట్టు తరపున ఆడనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కోశాధికారి గాజుల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు బోరే యాదగిరి అభినందించారు.

