DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో వెంకటాపూర్ గ్రామంలో ఇంట్లో ఆరుగురు సజీవ దహనమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో మాసు శివయ్య (50సం.) భార్య రాజ్యలక్ష్మి తోపాటు శివయ్య వదిన కూతురు కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన గత మూడు రోజుల క్రితం వచ్చిన మౌనిక (35సం.) ఇద్దరు (4సం) (2సం)ల ఆడపిల్లలు మరియు శాంతయ్య అందరూ మంటల్లో సజీవ దానమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ సంఘటన స్థలానికి చేరుకొని స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా చేశారా అనే కోణంలో విచారణ చేపడతామని తెలిపారు. ఈయనతో పాటు మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి. మందమర్రి ప్రమోద్ రావు, రామకృష్ణాపూర్ ఎస్సై అశోక్ తదితరులు ఉన్నారు.



