DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఎస్.కె హమీద్, పుల్ల సంపత్, సజ్జుభేగం, రాజవరం పద్మ శంకరచార్యులు సహకారంతో సాయి భోజన్ నిర్వహించారు. సింగరేణి ఏరియా కేంద్రమైన బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి మంగళవారం బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణులకు, రోగులకు, సాయి భోజన్ అన్నదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, స్థానిక కార్మికులు, గర్భిణీలు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి జక్కం నాగమణి, సభ్యులు కొంక శ్రీనివాస్, సేవకులు ఇగురపు భాస్కర్,ఎనగందుల దత్తు, సుంకరి సమ్మయ్య, విజ్జిగిరి శంకర్, మెరుగు మల్లీశ్వరి, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.


