DIGITAL MANCHERIAL NEWS:- తాండూర్ మండల BRS పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... మండలంలోని BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకకాలంలో బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ఈ నెల 29వ తేదీన బెల్లంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్నందున ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.


